
ఓటీటీ

ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు ఊరట కలిగించేలా కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ.2 లక్షల 60 వేల కోట్ల వ్యయాన్ని అంచనా వేసినట్లు సమాచారం. పెట్టుబడి ఖర్చుపై అదనంగా 50 శాతం కలిపి కొత్త ధరలను నిర్ణయించినట్లు వెల్లడించింది.
తాజా నిర్ణయం ప్రకారం వరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,441 గా నిర్ణయించగా, గ్రేడ్-ఏ వరికి రూ.2,461 మద్దతు ధరగా ఖరారు చేశారు. ఈ నిర్ణయం రైతులకు ఆర్థికంగా మేలు చేయడంతో పాటు ఖరీఫ్ సాగుకు ప్రోత్సాహం కలిగిస్తుందని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!