
క్రీడలు

డీఎంకే నేత, ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ టీవీకే పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని, 65 శాతం మంది ఓటర్లు విజయ్‌ను తిరస్కరించారని పేర్కొన్నారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ప్రజలు ఓటేశారని అన్నారు. అలాగే డీఎంకే కూటమిలోని పార్టీలే టీవీకేకు మద్దతు ఇస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు.
విజయ్‌పై నమ్మకం లేకపోవడం వల్లే ఆయన రెండు చోట్ల పోటీ చేశారని, ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదని విమర్శించారు. టీవీకే గుర్రాల వ్యాపారానికి పాల్పడుతోందని ఆరోపించారు. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కలవడం విడ్డూరమని, ముఖ్యమంత్రి కన్నా ముందు సోఫాసెట్లు వెళ్లి, ఆ తర్వాత పూల గుచ్ఛాలతో ముఖ్యమంత్రి వెళ్లడం రాజకీయ నాటకంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!