

అమరావతిలోని నిడమర్రులో బొల్లినేని నైపుణ్య, విద్యా పరిశోధన సంస్థ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చిన్న స్థాయిలో ప్రారంభమైన కిమ్స్ ఆసుపత్రి నేడు భారీ స్థాయికి ఎదిగిందని తెలిపారు. దేశం, రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు పెద్ద సంఖ్యలో రావాలని ఆయన అన్నారు. గతంలో హైదరాబాద్లో తక్కువ సంఖ్యలో ఆసుపత్రులు, హోటళ్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు అది దేశానికి వైద్య కేంద్రంగా మారిందని తెలిపారు.
అమరావతిలో 23 ఎకరాల్లో వైద్య కళాశాల, 2 ఎకరాల్లో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. 500 పడకల అత్యాధునిక ఆసుపత్రితో పాటు వైద్య, వైద్యేతర కోర్సుల ద్వారా వేలాది మందికి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, సాంకేతిక సిబ్బందికి భారీ డిమాండ్ ఉందని, వైద్యులు కూడా ఇప్పుడు ఏఐ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 2027 నాటికి ఆసుపత్రి, విశ్వవిద్యాలయ నిర్మాణాలు పూర్తి కావాలని కోరుతూ, రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!