

రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో దారా ఖోస్రోషాహితో భేటీ అయ్యారు. తెలంగాణలో ఉబెర్ విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. సమావేశంలో ఉబెర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్, ఉబెర్ ఇండియా & సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్జీత్ సింగ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నిప్పల్లి నాగ, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను విస్తరిస్తున్నామని, ప్రస్తుతం అక్కడ 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని ఉబెర్ సీఈఓ ముఖ్యమంత్రికి వివరించారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలనే ఆసక్తిని కూడా ఉబెర్ సంస్థ వ్యక్తం చేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి, మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై సమగ్ర అధ్యయనం చేస్తామని ఉబెర్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. వ్యాపార విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!