

తెలంగాణ రాష్ట్రంలో మరో భయానక బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై, నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలో ఈ ఘటన జరిగింది. ‘విహారి’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు చెలరేగిన వెంటనే వారు ప్రాణాపాయం నుంచి బయటపడటానికి అద్దాలను పగులగొట్టి బయటకు దూకారు. అదృష్టవశాత్తూ ఎవరూ పెద్దగా గాయపడలేదు.
అయితే, కొన్ని నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమై బూడిదైపోయింది. బస్సు మంటల్లో చిక్కుకున్న దృశ్యం చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
ఇటీవల కర్నూలు జిల్లాలో వి. కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది సజీవ దహనమవడం ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచే ఘటన. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగుతుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (1)
“ప్రాణాలు కాపాడుకున్నందుకు ధన్యవాదాలు, భద్రతా చర్యలపై మరింత దృష్టి పెట్టాలి.”