

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ అధికారుల ప్రకారం అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఆకస్మిక వర్షాలు పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!