

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన దేశ–విదేశీ అతిథుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన విందును ఏర్పాటు చేసింది. తెలంగాణ సంప్రదాయ ఆతిథ్యాన్ని చూపించేలా తాజ్ హోటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. స్థానిక Telangana రుచులతో పాటు అంతర్జాతీయ వంటకాలను మేళవించి అతిథులకు విభిన్నమైన ఫుడ్ అనుభవాన్ని అందించారు.
ఈ విందులో హైదరాబాదీ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, ఖుబానీ కా మీఠా వంటి ప్రసిద్ధ వంటకాలను అందించారు. విదేశీ ప్రతినిధులను దృష్టిలో పెట్టుకుని గ్రిల్డ్ ఫిష్, రోస్ట్ చికెన్ వంటి పాశ్చాత్య వంటకాలను కూడా చేర్చారు. అల్పాహారం మరియు స్నాక్స్‌లో సకినాలు, ఇప్పపువ్వు లడ్డూ, ఉస్మానియా బిస్కెట్లు వంటి తెలంగాణ ప్రత్యేకతల్ని వడ్డించారు. పండ్లతో అక్కడికక్కడే కోల్డ్ ప్రెస్ జ్యూస్‌లు తయారు చేసి అతిథులకు అందించారు.
ఈ ఏర్పాట్ల కోసం తాజ్ హోటల్స్‌కు చెందిన 450 మంది సిబ్బంది వారం రోజుల ముందే సన్నద్ధమయ్యారు. తాజ్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ గణేశ్ మాట్లాడుతూ, “అంతర్జాతీయ ప్రమాణాలు, FSSAI నిబంధనలు పాటిస్తూ పూర్తి పరిశుభ్రతతో వంటకాలను సిద్ధం చేశాం. ప్రతిదీ తాజాగా వండి అతిథులకు వడ్డించాం” అని తెలిపారు. సంప్రదాయం–ఆధునికత మేళవింపుతో చేసిన ఈ విందు అతిథులను ఎంతగానో ఆకట్టుకుంది.




.png&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!