

టిబెట్ బౌద్ధ మత అత్యున్నత గురువు దలైలామా ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. 90 ఏళ్ల వయసులో తన మొదటి గ్రామీ అవార్డును స్వీకరించడంతో, ఆయనకు అంతర్జాతీయ దృష్టి కేంద్రమైంది. ఇది సంగీత రంగంతో పాటు సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లోనూ మైలురాయిగా నిలిచింది.
‘మెడిటేషన్..’ (Meditations: The Reflections of His Holiness the Dalai Lama) అనే ఆల్బమ్‌కు గాను దలైలామాను ఈ అవార్డు వరించింది. ఇందులో ఆయన తన ఆలోచనలు, సందేశాలను ఆడియో రూపంలో అందించారు. ధ్యానం, శాంతి, దయ, అంతర్ముఖ పరిశీలన వంటి అంశాలపై ఆయన స్వయంగా చెప్పిన భావాలను ఈ స్పోకెన్-వర్డ్ ఆల్బమ్‌తో ప్రజలకు అందించారు. దలైలామా చేసిన ఈ ప్రసంగాలకు.. సరోద్ వాయిద్యకారుడు అంజద్ అలీఖాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.
ఇక సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డుల (Grammys Awards) వేడుక ది రికార్డింగ్ అకాడమీ ఆధ్వర్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా జరిగింది. 68వ గ్రామీ అవార్డుల వేడుకలో ప్రపంచవ్యాప్తంగా తమ పాటలతో, ఆల్బమ్‌లతో ప్రేక్షకులను అలరించిన వారు పురస్కారాలు అందుకున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!