
న్యూస్

కొలంబియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ చిన్న విమానం కూలిపోవడంతో 13 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఆ దేశానికి చెందిన ప్రతినిధులసభ సభ్యుడు ఒకరు ఉన్నట్లు తెలిపారు. ఈ విమానం ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థకు చెందినదిగా గుర్తించగా, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!