
గాసిప్స్

ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాట్లు వరుసగా కొనసాగుతున్నాయి. తాజాగా మొత్తం 11 మంది మావోయిస్టులు అధికారుల ఎదుట లొంగిపోయారు. వీరిలో కేంద్ర కమిటీ కీలక నేత రాంధెర్ కూడా ఉన్నారు. ఆయన పై రూ.3 కోట్ల బహుమతి ప్రకటించబడిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల పై ప్రభావం చూపే ఎంఎంసీ జోన్లో రాంధెర్ ఎన్నాళ్లుగానో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. మిళింద్ తెల్టుంబే మరణించిన తర్వాత ఆ జోన్ బాధ్యతలు పూర్తిగా ఆయనే చేపట్టారు. ఇప్పుడు ఆయన లొంగుబాటు కారణంగా మూడు రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతాలు నక్సల్ ప్రభావం నుండి దాదాపు విముక్తమవుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇటీవలి నెలల్లో వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగి ప్రధాన ప్రవాహంలోకి రావడం గమనార్హం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!