
_2K.png&w=3840&q=75)
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న పోలీస్ శాఖ ఉద్యోగ నియామకాల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. పోలీస్ శాఖలో భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 14 వేల స్టయిపెండరీ క్యాడెట్ కానిస్టేబుల్ పోస్టులు సహా ఇతర పోలీస్ సర్వీసుల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
మంగళవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జర్నలిస్టులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగ భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయని, నిరుద్యోగులకు నూతన సంవత్సర కానుకగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఏడాది పదవీ విరమణలు పెరుగుతూ, కొత్త నియామకాలు లేకపోవడంతో పోలీసులపై పనిభారం అధికమవుతోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఖాళీలను భర్తీ చేసి పోలీస్ శాఖ పనితీరును మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!