
రాజకీయాలు

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇరుముడి' చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్రబృందం రెండో పాట 'యాలాలో యాలాలో'ను విడుదల చేసింది. "యాలాలో యాలాలో వెన్నెట్లో ఎన్నెన్ని ముచ్చట్లో" అంటూ సాగే ఈ మెలోడీకి ప్రముఖ గేయరచయిత అనంతశ్రీరామ్ సాహిత్యం అందించారు. ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!