

తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 2026 నవంబర్ 20న ఈ సినిమాను థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్ సింపుల్ మిడిల్ క్లాస్ లుక్‌లో కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్, శ్వేత సబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. దుల్కర్ సరికొత్త పాత్రలో కనిపించనున్న ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!