

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన వారణాసి టైటిల్ రివీల్ ఈవెంట్ అప్రత్యాశితంగా ఉద్రిక్తంగా మారింది. ట్రైలర్ ప్రదర్శన సమయంలో భారీ ఎల్ఈడి స్క్రీన్ అకస్మాత్తుగా ఫ్రీజ్ అవడంతో దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ లోపం లక్షల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న సమయానికే రావడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఈవెంట్‌కు ముందు రాత్రి అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా వినియోగించడంతో టీమ్ సరైన టెస్టులు చేయలేకపోయిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల రాజమౌళి అప్పుడే అసంతృప్తిగా ఉండగా, ఈ లోపం అతని నిరాశను మరింత పెంచింది.
విజయేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో హనుమంతుడు రాజమౌళిని ఈ ప్రాజెక్ట్‌లో నడిపిస్తున్నారని చెప్పడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. దీనికి స్పందించిన రాజమౌళి తాను దేవుడిని నమ్మనని, నిజంగానే హనుమంతుడు నడిపిస్తే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. తన భార్యకు హనుమంతుడిపై గాఢమైన భక్తి ఉన్నప్పటికీ, ఇలాంటి ఘటనలు సందేహాలు కలిగిస్తాయని అన్నారు. ఒత్తిడిలో ఉన్నందువల్లే ఇలా మాట్లాడారని అభిమానులు చెబుతున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో పౌరాణిక అంశాలకు గౌరవం ఇచ్చిన రాజమౌళి ఈ చిన్న వ్యాఖ్య వల్ల వివాదం రావద్దని అభిమానులు భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!