

దేశంలో టెలికం వినియోగదారుల సంఖ్య జూన్ నెలలో 134.8 కోట్లకు చేరింది. భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లలో కొత్త వినియోగదారులు భారీగా చేరడంతో ఈ వృద్ధి నమోదైంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
మే నెలతో పోలిస్తే జూన్‌లో భారతి ఎయిర్‌టెల్‌కు 31.63 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు. వీరిలో 29.89 లక్షల మంది మొబైల్ వినియోగదారులు, 1.73 లక్షల మంది ఫిక్స్డ్ లైన్ కస్టమర్లు ఉన్నారు. రిలయన్స్ జియోకు నికరంగా 22.91 లక్షల మంది చేరగా, అందులో 21.46 లక్షల మంది మొబైల్, 1.44 లక్షల మంది ఫిక్స్డ్ లైన్ వినియోగదారులు ఉన్నారు. జూన్‌లో మొత్తం 62 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరగా, అందులో 54.54 లక్షల మంది ఎయిర్‌టెల్, జియోకే చెందినవారు.
బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య కూడా 108 కోట్ల నుంచి 108.75 కోట్లకు పెరిగింది. 53.22 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులతో జియో అగ్రస్థానంలో కొనసాగగా, ఎయిర్‌టెల్‌కు 37.99 కోట్లు, వొడాఫోన్ ఐడియాకు 13 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 2.7 కోట్లు వినియోగదారులు ఉన్నారు. ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియాకు 1.64 లక్షల వైర్‌లెస్ వినియోగదారులు, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 94,006 మంది కొత్త యూజర్లు చేరగా, ఎంటీఎన్‌ఎల్ 11,284 మంది వినియోగదారులను కోల్పోయింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!