

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తులో వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తుందని, వ్యాధులను ఖచ్చితంగా గుర్తించడం నుంచి రోబోట్లు శస్త్రచికిత్సలు నిర్వహించే స్థాయికి చేరుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో వైద్యుల పాత్ర భవిష్యత్తులో మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుత విద్యా విధానాన్ని ప్రశ్నిస్తూ, భవిష్యత్తులో ఏఐ కీలక బాధ్యతలు చేపడితే విద్యార్థులు ఇంకా నీట్ పరీక్షలకు సిద్ధమవుతూ వైద్య విద్య కోసం సంవత్సరాలు ఎందుకు వెచ్చిస్తున్నారని ప్రశ్నించారు. ఏఐ యుగంలో సంప్రదాయ విద్యా విధానంలో సమూల మార్పులు అవసరమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. కొందరు ఆయన అభిప్రాయాలను భవిష్యత్ దిశగా చూస్తుండగా, మరికొందరు వైద్యుల పాత్రను, వైద్య విద్య ప్రాధాన్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!