
సినిమాలు

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించగా, ఎస్.ఎస్. తమన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తాజా ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ, ‘లెనిన్’ కోసం మొదట ఒక ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేసి, దానికి స్వరాలు కూడా సిద్ధం చేశామని తెలిపారు. ఆ పాట కోసం కయాదు లోహర్, ప్రీతి ముఖుందన్, పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు చెప్పారు. అయితే కథకు ఆ పాట సరిపోదని భావించిన చిత్రబృందం చివరకు దానిని తొలగించిందని, కథకు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!