
సినిమాలు

పెరియా మారియమ్మన్ ఆలయ ఆడి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదానికి దారి తీసింది. ఆ ఫ్లెక్సీలో నటి త్రిషను అమ్మవారి గెటప్‌లో చూపించగా, ఆమె పైన విజయ్ అసెంబ్లీలో చేసిన సిగ్నేచర్ పోజ్‌తో కనిపించారు. సినీ నటిని దేవతా రూపంలో చూపించడం సరికాదంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది.
వివాదం చెలరేగిన వెంటనే బ్యానర్‌ను తొలగించి మరోదాన్ని ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా అభ్యంతరకరమైన బ్యానర్ ఏర్పాటు చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. దుకాణ యజమాని గోకుల్, బ్యానర్ ఏర్పాటు చేసిన చంద్రుపై కేసు నమోదు కాగా, వారు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో విజయ్-త్రిషపై కొనసాగుతున్న చర్చలతో పాటు ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల చిత్రాల వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!