

హీరో అడివి శేష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా స్పై థ్రిల్లర్ ‘గూఢచారి-2’ (G2)పై అంచనాలు మరింత పెరిగాయి. సూపర్‌హిట్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ ఎడిట్ వెర్షన్ చూసిన నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాధారణంగా అడివి శేష్ తన సినిమాలను 90 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత చూపిస్తుంటాడని, కానీ ‘G2’లో కేవలం 70 శాతం షూటింగ్ పూర్తైన ఎడిట్ వెర్షన్ చూసినప్పుడే తాను షాక్ అయ్యానని చెప్పారు.
సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, మైండ్ గేమ్స్, ట్విస్ట్‌లు అద్భుతంగా ఉన్నాయని రాహుల్ రవీంద్రన్ ప్రశంసించారు. ఈ ఇండియన్ స్పై థ్రిల్లర్ భారతీయ సినీ చరిత్రలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించే అవకాశం ఉందని, థియేటర్లలో ప్రేక్షకులను అలరించడం ఖాయమని అన్నారు. అడివి శేష్ కెరీర్‌లో ఇది మరో మైలురాయి చిత్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇమ్రాన్ హష్మీ తనదైన క్లాస్ స్వాగ్‌తో ఆకట్టుకున్నారని, వామికా గబ్బి అద్భుతంగా నటించారని ప్రశంసించారు. దర్శకుడు వినయ్ కుమార్ పదేళ్ల క్రితం తన వద్దకు లవ్ స్టోరీతో వచ్చారని, నిర్మాత కుదరకపోవడంతో శేష్ టీమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఇంత భారీ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!