

ఒలింపిక్ ఛాంపియన్, నార్వే స్టార్ అథ్లెట్ జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డైమండ్ లీగ్ ఫైనల్‌లో పురుషుల 1500 మీటర్ల రేసులో నాలుగో స్థానానికి పరిమితమైన అనంతరం.. ప్రత్యర్థుల రేసింగ్ వ్యూహాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పోటీలో పిరికివాళ్లతో రేస్ చేయాల్సి వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రేసులో ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ మైయర్స్ 3:30.14 టైమింగ్‌తో విజేతగా నిలిచి డైమండ్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
కెన్యా అథ్లెట్ ఫానుయెల్ కిప్‌కోగ్సెయి 3:30.18 టైమింగ్‌తో కేవలం 0.04 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన ఈతన్ స్ట్రాండ్ 3:30.50తో మూడో స్థానంలో నిలవగా.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ 3:30.52 టైమింగ్‌తో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రేసు ముగిసిన అనంతరం జాకబ్ చేసిన వ్యాఖ్యలు అథ్లెటిక్స్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!