

ఇటీవల స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆపరేషన్ సఫేద్ సాగర్ వెబ్‌సిరీస్ విజయంతో ఉత్సాహంగా ఉన్న నటుడు సిద్ధార్థ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సతీమణి అదితి రావు హైదరి గురించి భావోద్వేగంగా మాట్లాడారు. అదితి తనకు సోల్‌మేట్ అని, ఆమె తన జీవితంలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఆమె లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేనని పేర్కొన్న సిద్ధార్థ్.. 20 ఏళ్ల తర్వాత ‘రంగ్ దే బసంతి’ తరహా విజయం అందుకోవడం ఎంత సంతోషాన్నిచ్చిందో, అదితి తన జీవితంలోకి రావడం కూడా అంతే ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.
మరోవైపు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ వ్లాగ్‌లో పాల్గొన్న అదితి రావు హైదరి.. సిద్ధార్థ్‌ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడానికి తనకు ఎక్కువ సమయం పట్టలేదని వెల్లడించారు. సిద్ధార్థ్ ఎంతో మంచి మనిషని, తనలో ఎలాంటి కల్మషం ఉండదని ఆమె అన్నారు. ముఖ్యంగా తన కుటుంబాన్ని ఎంతో ప్రేమించడంతో పాటు, తనకు ఇష్టమైన వారందరినీ ఒక్కచోట చేర్చే ఆయన స్వభావం తనను ఆకట్టుకుందని అదితి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!