

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లను కూడా ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌ల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు కూడా ప్రత్యేక జిల్లా పరిషత్‌లను మంజూరు చేసింది. ఈ చర్యతో కొత్త జిల్లాల పరిపాలన వ్యవస్థకు అనుగుణంగా స్థానిక పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడనుంది.
కొత్తగా ఏర్పాటు కానున్న జెడ్పీల కోసం అదనంగా 15 జిల్లా పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెంటనే 28 కొత్త జిల్లా పరిషత్‌ల వ్యవస్థ అమల్లోకి రానుంది. దీంతో రాష్ట్రంలో జిల్లా స్థాయి స్థానిక పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!