
బిజినెస్

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లాకు చెందిన నిస్సార్.. ఆర్కాన్సాస్ రాష్ట్రంలోని లిటిల్ రాక్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నిస్సార్ ఒహాయోలోని కెంట్ స్టేట్ యూనివర్సిటీలో తన చదువు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన తండ్రికి గుండె శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం. కుమారుడి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిస్సార్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు, ఆయన స్నేహితులు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!