

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’ ట్రైలర్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను వీక్షించిన ఆయన, రాయలసీమ చారిత్రక పోరాటాన్ని, బ్రిటిష్ పాలకుల అణచివేతను తెరపై ఆవిష్కరించిన తీరును అభినందించారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రాయలసీమ చరిత్రలోని కీలక ఘట్టాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
లోకేశ్ ప్రశంసలపై విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా స్పందించారు. రాయలసీమ తనకు ఎంతో ఇచ్చిందని, ఈ సినిమా ద్వారా ఆ గడ్డకు తిరిగి ఏదైనా అందించాలనే తన బాధ్యతను నెరవేర్చుకుంటున్నానని పేర్కొన్నారు. లోకేశ్ సందేశం చిత్ర బృందంలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు. రాయలసీమ గొప్పతనాన్ని, అక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడేలా ‘రణబాలి’ ఉంటుందని, వెండితెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి ఎదురుచూస్తోందని విజయ్ దేవరకొండ ఆశాభావం వ్యక్తం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!