

భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం రామాయణ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిత్ర బృందంలోని కీలక సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ సాయిపల్లవి, దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ భేటీలో పాల్గొన్నారు. వీరంతా అమిత్ షాతో సమావేశమైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సందర్భంగా సినిమా రూపకల్పన, నిర్మాణం, ఇతిహాస కథను తెరపైకి తీసుకొచ్చిన విధానం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో నటించడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న యశ్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఆయన గైర్హాజరుకు గల కారణాలు తెలియరాలేదు.
సుమారు రూ.2,000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్‌తో పాటు రవి దూబే, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ నిర్మాణ విలువలు, అగ్ర తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కలిసి సంగీతం అందిస్తున్నారు. కథ, నటీనటులు, సాంకేతిక నిపుణుల కలయికతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!