

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి వర్ధమాన్ జైన్ దంపతులు భారీ బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో మొత్తం రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను అందజేశారు. స్వామివారి కోసం ప్రత్యేకంగా 46 రకాల ఆభరణాలను తయారు చేయించారు. వీటిలో 106 కిలోల బంగారంతో రూపొందించిన ఆభరణాలు శ్రీవారికి సమర్పించగా, శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కిలోల బరువైన బంగారు వస్త్రాన్ని అందించారు.
ఈ కానుకల్లో బంగారు కిరీటం, పాద కవచాలు, అందెలు, తులసిపాత్ర హారం, అష్టోత్తర కాసుల మాల, కౌస్తుభం, శ్రీవత్సం, నాగాభరణాలు, భుజకీర్తులు, శంఖ, చక్ర కవచాలు తదితర ఆభరణాలు ఉన్నాయి. అంతేకాకుండా నీలాలు, పుష్యరాగాలు, కెంపులు, పచ్చలు పొదిగిన శ్రీవత్సం పతకంతో పాటు వజ్రాలు పొదిగిన ఆభరణాలను కూడా సమర్పించారు. ఈ విలువైన కానుకలు తిరుమల ఆలయ ఆభరణాల ప్రత్యేకతను మరింత చాటిచెప్పాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!