

టాలీవుడ్ యువ కథానాయకుడు ప్రియదర్శి, యూట్యూబ్ సెన్సేషన్ నాగదుర్గ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇడుపు కాయితం’. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, ప్రేమ, పెళ్లి, దాంపత్య జీవితంలోని భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లను వేగవంతం చేసిన చిత్రబృందం, వరుస అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన నాలుగు పాటలకు మంచి స్పందన లభించగా, తాజాగా మరో మాస్ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ‘ఉల్లిపూల’ పేరుతో రూపొందించిన ఈ మాస్ డ్యాన్స్ సాంగ్ లిరికల్ వీడియోను నవంబర్ 28న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా నాగదుర్గ మాస్ స్టెప్పులతో కనిపిస్తున్న క్రేజీ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందరినీ ఉర్రూతలూగించే మాస్ వైబ్ రాబోతోందంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. ఇప్పటికే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో అంచనాలు పెంచిన ఈ సినిమా, కొత్త పాటతో మరింత బజ్ సంపాదించుకునేందుకు సిద్ధమవుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!