
సినిమాలు

సామాజిక అంశాలను బలమైన కథలతో తెరపై ఆవిష్కరించే దర్శకుడు వెట్రిమారన్ మరోసారి విజయ్ సేతుపతితో జట్టు కట్టనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శింబు హీరోగా రూపొందుతున్న ‘అరసన్’ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఆండ్రియా, ప్రియాంక మోహన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తుండగా, కలైపులి ఎస్. ధాను నిర్మిస్తున్నారు.
‘అరసన్’ తర్వాత ధనుష్‌తో ‘తమిళ్ మురుగన్’, ‘వడచెన్నై 2’ చిత్రాలను పూర్తి చేసిన అనంతరం విజయ్ సేతుపతితో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. ఈ సినిమా కార్యరూపం దాల్చితే వెట్రిమారన్ – విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఇది నాలుగో చిత్రం అవుతుంది. అయితే ఈ వార్తపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!