

భక్తిరస చిత్రం హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన విజయాన్ని అందుకుంటూ దూసుకెళ్తోంది. ఈ సినిమా సాధిస్తున్న భారీ విజయానికి ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ సినీపోలిస్ అనుసరించిన వ్యూహాత్మక పంపిణీ విధానం కూడా కీలకంగా మారిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తొలుత ఈ చిత్రం కేవలం 300 స్క్రీన్లలో విడుదలై, మొదటి వారంలో సుమారు రూ.90 లక్షలు మాత్రమే వసూలు చేసింది.
అయితే ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన మౌత్ టాక్‌ను నమ్మిన థియేటర్ యజమానులు సినిమాను కొనసాగిస్తూ షోలను అలాగే ఉంచారు. దీంతో హనుమాన్ అంశ్‌కు క్రమంగా ఆదరణ పెరిగి, ప్రస్తుతం 2,500కు పైగా స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రూ.200 కోట్ల కలెక్షన్ల మైలురాయి వైపు వేగంగా దూసుకెళ్తోంది. పరిమిత స్క్రీన్లతో మొదలై భారీ స్థాయికి విస్తరించిన ఈ సినిమా ప్రయాణం ఎగ్జిబిషన్ రంగంలో ఆసక్తికరమైన పరిణామంగా ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!