

నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ విడుదలకు ముందే ఆసక్తికరమైన నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. సాధారణంగా భారీ సినిమాలకు ట్రైలర్ విడుదల చేసి ప్రమోషన్స్‌ను మరింత పెంచుతారు. అయితే ది ప్యారడైజ్ విషయంలో మాత్రం ట్రైలర్‌ను విడుదల చేయకుండానే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ విషయాన్ని నాని స్వయంగా ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.
ట్రైలర్ విడుదల చేయకపోవడానికి గల కారణాన్ని నాని వివరిస్తూ.. ప్రేక్షకుల ఆదరణను గ్రాంటెడ్‌గా తీసుకోవడం వల్ల కానీ, సినిమాపై ఉన్న హైప్‌పై గర్వంతో కానీ ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ఔట్‌పుట్ నాణ్యత కోసం పలు టీమ్స్ రేయింబవళ్లు పనిచేస్తున్నాయని తెలిపారు. మంచి ట్రైలర్ సిద్ధం చేయాలంటే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సహా కీలక సాంకేతిక నిపుణులు నాలుగైదు రోజుల పాటు సినిమా ప్రధాన పనులను పక్కన పెట్టాల్సి వస్తుందని చెప్పారు. సినిమా కంటే ట్రైలర్ ముఖ్యమైనది కాదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, కాయాదు లోహర్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!