
.jpg&w=3840&q=75)
ప్రఖ్యాత టాలీవుడ్ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన కేవలం తెలుగు కాకుండా హిందీ, తమిళ్, బోజ్‌పురి భాషల్లో 370 కి పైగా సినిమాలు, సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి, సినిమా పరిశ్రమలో విశేష గుర్తింపు పొందారు. రఘునాథ్ రెడ్డి స్వస్థలం విజయవాడ. ఆయన భార్య అన్నపూర్ణ, ముగ్గురు పిల్లలు సుధా లక్ష్మి, అరుణ, సుధాకర్.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, నెల రోజుల క్రితమే రఘునాథ్ రెడ్డి కొడుకు గుండెపోటుతో మరణించడం కారణంగా ఆయన మానసికంగా కుంగిపోగా, ఈ క్రమంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన కెరీర్ 1991 లో శోభన్ బాబు సినిమా సర్పయాగంతో ప్రారంభమై, పెళ్ళి పందిరి, ఒరేయ్ రిక్షా, కలెక్టర్ గారు, ప్రేమించుకుందాం రా, ఆజాద్, ఛలో అసెంబ్లీ, దేవీ పుత్రుడు, సుబ్రహ్మణ్యపురం, శ్రీ రామ రాజ్యం, వస్తాడు నా రాజు, గాయం 2, మిస్టర్ గిరీశం, నేరము - శిక్ష, సైనికుడు, సంక్రాంతి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు గుర్తింపు పొందారు. టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!