

తమిళ స్టార్ సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా, సాధారణంగా కలెక్షన్లు తగ్గే సోమవారం రోజున కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపించడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
దర్శకుడు ఆర్ జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిష కీలక పాత్ర పోషించగా, యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో బలంగా మారింది. పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ఈ చిత్రానికి కలిసి వస్తోందని, లాంగ్ రన్లో మరింత భారీ వసూళ్లు సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!