
సినిమాలు

మెగా అభిమానులకు వరుణ్ తేజ్ ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన కెరీర్‌లో తొలిసారి తండ్రి, ప్రముఖ నటుడు నాగబాబుతో కలిసి ఒకే సినిమాలో నటించనున్నట్లు వెల్లడించారు. ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు ముందు ఓవర్సీస్ అభిమానులతో నిర్వహించిన ప్రత్యేక జూమ్ మీటింగ్‌లో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. యదువంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బరి’ సినిమాలో వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
తండ్రితో కలిసి నటించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని వరుణ్ తేజ్ తెలిపారు. సినిమాలో తండ్రీకొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను, ముఖ్యంగా మెగా అభిమానులను ఆకట్టుకుంటాయని చెప్పారు. నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుంది. వరుణ్ తేజ్, నాగబాబు కాంబినేషన్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!