

‘ఆర్‌ఎక్స్ 100’తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ గుమ్మకొండ రెండేళ్ల విరామం తర్వాత హీరోగా తిరిగి వస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘కమ్‌బ్యాక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 21న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడంతో పాటు ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తికేయ సతీమణి లోహితా రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘కమ్‌బ్యాక్’ గ్లింప్స్‌లో కార్తికేయ బాక్సర్‌గా కనిపించారు. స్కిప్పింగ్, బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఆయన లుక్ ఆకట్టుకుంది. మూడేళ్లుగా బాక్సింగ్ ప్రపంచానికి దూరంగా ఉన్న వ్యక్తి తిరిగి రావడం నేపథ్యంలో ఆసక్తికరమైన వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్‌ను రూపొందించారు. విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం అందించగా, జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ, కేఆర్ కుమార్ మన్నే ప్రొడక్షన్ డిజైన్, కళ్యాణ్ సూర్యప్రకాశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథ, దర్శకత్వంతో పాటు కార్తికేయ ఈ చిత్రంలో హీరోగానూ నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!