

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ అంచనాల చిత్రం ‘ది ప్యారడైజ్’కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని నాని తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రకటనతో పాటు ప్రత్యేకమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ గురువారం థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా నాని కెరీర్‌లోనే భారీ స్థాయి ఫస్ట్ డే ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే తొలి వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడైన ‘షికంజా మాలిక్’ పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. రాఘవ్ జుయాల్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, బాబు మోహన్, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా, భారీ స్థాయిలో ఈ పాన్-ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!