

టాలీవుడ్లో కొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ‘బ్లాక్ మెయిల్’ చిత్రం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. నటులు వరుణ్ సందేశ్, సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత అవినాష్ కూనపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా ప్రారంభించగా, కోన వెంకట్ తొలి క్లాప్ ఇచ్చారు. సురేష్ తల్లి వెంకట సుబ్బలక్ష్మి గౌరవ దర్శకత్వం వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని వరుణ్ సందేశ్ తెలిపారు. నిర్మాత అవినాష్ కూనపరెడ్డి మాట్లాడుతూ సినీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సినిమాలు నిర్మిస్తున్నానన్నారు. సినిమా లాభాల్లో పది శాతం సాంకేతిక నిపుణులకు పంచుతానని ఆయన ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!