
రాజకీయాలు

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా దాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఆర్య-2' సినిమాలో ఆయనతో కలిసి నటించిన రోజులను గుర్తు చేసుకుంటూ, ప్రస్తుతం బన్నీ భారతదేశంలోనే అత్యంత పెద్ద స్టార్‌లలో ఒకరిగా ఎదగడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
అల్లు అర్జున్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళం, మలయాళం, ఉత్తర భారతదేశంలో కూడా అద్భుతమైన ఆదరణ లభిస్తోందని శ్రద్ధా దాస్ పేర్కొన్నారు. ఆయన డబ్బింగ్ సినిమాలు కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లు సాధిస్తాయని, ఆయన సినిమాల్లో నటించడం వల్ల తనకూ ఉత్తర భారత ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చిందని చెప్పారు. బన్నీ స్టార్‌డమ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!