
సినిమాలు

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి' భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా నిలవనుంది. సుమారు రూ.1,300 నుంచి రూ.1,400 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
విజువల్ ఎఫెక్ట్స్‌పై పూర్తిగా ఆధారపడకుండా, సహజమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించేందుకు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా నిజమైన లొకేషన్లలో చిత్రీకరణ చేపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 120 మంది సిబ్బందితో కెన్యా అడవులు, జాతీయ పార్కుల్లో షూటింగ్ నిర్వహించగా, త్వరలో అంటార్కిటికాలోని రాస్ ఐస్ షెల్ఫ్ వద్ద కూడా కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!