

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మంచి అంచనాలు తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్‌కు మొదట సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్ ఎంపిక కావడం ఆసక్తిని కలిగించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఈ చిత్రానికి కొత్త సంగీత దర్శకుడిగా థమన్ ఎస్ ఎంట్రీ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ సినిమాలకు గతంలో సక్సెస్ఫుల్ ఆల్బమ్స్ అందించిన థమన్ మళ్లీ ఈ ప్రాజెక్ట్‌లో చేరడం అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది. సృజనాత్మక కారణాల వల్లే ఈ మార్పు జరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయని, వెంకటేష్‌కు తగ్గ ఫ్యామిలీ, ఎమోషనల్ టచ్‌తో పాటలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!