

చైనాలో ఇటీవల విడుదలైన యానిమేషన్ చిత్రం ‘న్యూ లాయ్’ ఊహించని విజయాన్ని అందుకుంటోంది. ఆవు, పిచ్చుక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను నాసిరకం 3డీ యానిమేషన్ అంటూ మొదట్లో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. విడుదలైన తొలి 10 రోజుల్లో కేవలం 7,705 యువాన్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమాకు సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లిప్స్ ఊహించని ప్రచారం తీసుకొచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు భారీగా పెరిగాయి.
మూవీ ట్రాకింగ్ సైట్ మావో యాన్ ప్రకారం, ‘న్యూ లాయ్’ ఇప్పటికే 11.4 మిలియన్ యువాన్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ట్రోల్స్, మీమ్స్, సోషల్ మీడియా పోస్టులే ఈ సినిమాకు ప్రధాన ప్రచారంగా మారాయి. ‘ఈ సినిమా చూస్తే 80 నిమిషాలు బాధపడతారు. చూడకపోతే జీవితాంతం పశ్చాత్తాపపడతారు’ అంటూ నెటిజన్లు సరదాగా పోస్టులు చేస్తున్నారు. అంతేకాదు, చైనాలో ‘ఆవు’ అనే పదానికి స్టాక్ మార్కెట్‌లో పెరుగుదలతో సంబంధం ఉండటంతో కొందరు మదుపర్లు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!