

కోలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎస్ జె సూర్య నటిస్తున్న ‘కిల్లర్’ సినిమా షూటింగ్ సమయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నైలోని ఒట్టేరి ప్రాంతంలోని బిన్నీ మిల్స్ ప్రాంగణంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మదన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి.
అదనంగా, సెట్స్‌లో ఉన్న మరో పది మందికి పైగా సిబ్బందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవడంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!