

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ‘ది మానిటి.ఇన్’ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. దర్శకుడు బీఎస్ రావు ఈ ప్రాజెక్ట్ ద్వారా భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త విజువల్ అనుభూతిని అందించబోతున్నారు. వందల కోట్ల బడ్జెట్‌ను దాటి వేల కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్న ఈ చిత్రం, హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్ తరహాలో రూపొందనుంది.
వీఎఫ్ఎక్స్లో అనుభవం కలిగిన టీమ్‌తో కలిసి, టాలీవుడ్లో తొలిసారిగా ఐమ్యాక్స్ 8కే ఫార్మాట్లో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. “మానవత్వం విఫలమైనప్పుడు ‘మానిటీ’ ఏం చేస్తుంది?” అనే ప్రత్యేక కాన్సెప్ట్‌తో కథ నడుస్తుందని దర్శకుడు తెలిపారు. ఇటీవల విడుదలైన పోస్టర్లలో “మానవత్వం నిర్లక్ష్యం చేయబడినప్పుడు... ‘మానిటీ’ ఉద్భవిస్తుంది” అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!