

దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని నెలలుగా టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇటీవల తరుణ్ భాస్కర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. ఆయన తమ బంధం గురించి పరోక్షంగా వెల్లడించారంటూ పలువురు చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తరుణ్ తల్లి గీతా భాస్కర్ ఈషా రెబ్బా గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈఎన్ఈ రిపీట్ ప్రీ-రిలీజ్ వేడుకలో ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ సందర్భంగా గీతా భాస్కర్ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా తరుణ్ ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడని తెలిపారు. ఆ కష్టకాలంలో ఈషా అతడికి అండగా నిలిచిందని చెప్పారు. తరుణ్‌కు ఈషా మంచి స్నేహితురాలు మాత్రమే కాకుండా, సోల్‌మేట్ అని అభివర్ణించారు. “తరుణ్ కోసం ఒకరు ఉన్నారని తెలిసి నాకు ధైర్యంగా ఉంది. థాంక్యూ ఈషా” అంటూ ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. గీతా భాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా మధ్య ఉన్న బంధంపై జరుగుతున్న చర్చకు మరింత ఆసక్తిని జోడించాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!