
గాసిప్స్

యువ హీరో తేజ సజ్జా మరియు హీరోయిన్ మీనాక్షి చౌదరి విజయవాడలో సందడి చేశారు. బెంజి సర్కిల్ సమీపంలోని చంద్రమౌళిపురం లో కొత్తగా ప్రారంభించిన ఓ వస్త్ర షోరూమ్‌ను వారిద్దరూ కలిసి ప్రారంభించారు. వారి కోసం అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సెల్ఫీలు, అభివాదాలతో వేదిక సందడిగా మారింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తేజ సజ్జా, సినిమా పైరసీ ఎంతో బాధకరమని, అది సినిమా వర్కర్స్ కష్టాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు. అభిమానులు ఎప్పుడూ థియేటర్లలోనే సినిమాలు చూడాలని, పైరసీకి దూరంగా ఉండాలని కోరారు. మీనాక్షి చౌదరి కూడా అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!