

జైలర్ 2 సక్సెస్ తర్వాత సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తదుపరి సినిమా ధర్మన్. యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూడా నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఆమె పాత్రపై ఆసక్తి నెలకొంది. తాజాగా శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఈ సినిమాలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతంతో రూపొందించిన ప్రత్యేక ప్రోమో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో శ్రీలీల ఒక లవ్లీ పాత్రలో కనిపించనుందని తెలిపారు.
రజినీకాంత్, శ్రీలీల కలయిక తెరపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సినిమాలో రాశి ఖన్నా, రామ్ పోతినేని కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నటీనటులు భాగం కావడం, అనిరుధ్ సంగీతం అందిస్తుండటంతో ధర్మన్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!