

మైదానంలో నెమ్మదిగా కదులుతాడనే విమర్శలకు టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో సమాధానమిచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో షార్ట్ లెగ్‌సైడ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్.. తనవైపు వచ్చిన బంతిని వేగంగా అందుకుని అద్భుతమైన త్రో విసిరాడు. దీంతో న్యూజిలాండ్ కీలక బ్యాటర్ డారిల్ మిచెల్ (28) రనౌట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ చురుకుదనం, కచ్చితమైన త్రో అభిమానులను ఆకట్టుకున్నాయి.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ వేసిన 21.1వ ఓవర్‌లో గ్లెన్ ఫిలిప్స్ బంతిని ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో అనవసరమైన సింగిల్ కోసం ప్రయత్నించిన మిచెల్‌కు రోహిత్ రూపంలో షాక్ తగిలింది. బంతిని అందుకున్న వెంటనే రోహిత్ వికెట్ల వైపు గురి చూసి విసిరిన త్రో నేరుగా స్టంప్స్‌ను తాకడంతో మిచెల్ క్రీజులోకి చేరుకోలేకపోయాడు. ఈ కీలక రనౌట్‌తో భారత్‌కు మంచి బ్రేక్‌థ్రూ లభించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!