
క్రీడలు

అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ ఘటనలో నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపిన వ్యవహారంపై పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అలాగే బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుంది.
మరోవైపు, నిందితుడు హేమంత్ తరఫున న్యాయవాది సాల్మన్ రాజు వాదనలు వినిపించారు. తనపై మీడియా, సోషల్ మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రసారం అవుతున్నాయని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో మీడియా ట్రయల్ జరగకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల చర్యలపై నివేదిక అందిన తర్వాత తదుపరి విచారణలో ధర్మాసనం పరిశీలించనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!