

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇప్పుడు మరో కీలక సవాల్ ఎదురుకానుంది. తనదైన ఆలోచనలు, పదునైన సంభాషణలు, విభిన్నమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన.. ఈసారి తన దర్శకత్వ ప్రతిభను మరో స్థాయిలో నిరూపించుకోవాల్సి ఉంది. ‘గుంటూరు కారం’, ‘ఆదర్శ కుటుంబం ఏకే47’ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఫలితం త్రివిక్రమ్ కెరీర్‌లో కీలకంగా మారనుందనే చర్చ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా పూర్తిగా భిన్నంగా ఉండనుందని సమాచారం. ‘డ్రాగన్’లో డ్రగ్స్ మాఫియా నాయకుడిగా కనిపించిన ఆయన, ఇప్పుడు పరమశివుడి కుమారుడైన కార్తికేయుడి పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విభిన్నమైన నేపథ్యంతో రూపొందుతున్న ఈ పాత్రపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇంతటి భారీ ప్రాజెక్టుకు కథ, కథనం కూడా అదే స్థాయిలో ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. త్రివిక్రమ్ రచన, ఎన్టీఆర్ నటన కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో చూడాలి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!