

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన సత్తా చాటేందుకు షారుఖ్ ఖాన్ సిద్ధమవుతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹665 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. విదేశీ పంపిణీ హక్కులు, భారతీయ థియేట్రికల్ హక్కులు, నెట్‌ఫ్లిక్స్, శాటిలైట్, సంగీత హక్కుల ద్వారా ఈ స్థాయి వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విడుదలకు ముందే సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ భారీ వ్యాపారానికి తగ్గట్టుగా వసూళ్లు సాధించడం ఇప్పుడు అసలు సవాలుగా మారింది. దాదాపు ₹500 కోట్ల నిర్మాణ వ్యయంతో పాటు ప్రచారం కోసం మరో ₹40 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పెట్టుబడులు తిరిగి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹800 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుందని అంచనా. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో షారుఖ్‌తో పాటు సుహానా ఖాన్, దీపికా పడుకోనే, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!