

బాలీవుడ్ ప్రముఖ గాయని కనికా కపూర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘బేబీ డాల్’, ‘చిట్టియాన్ కలైయాన్’ వంటి హిట్ పాటలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తన భర్త గౌతమ్ హతిరమణితో విడిపోతున్నట్లు ప్రకటించింది. నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 2022లో లండన్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ను ఆమె వివాహం చేసుకుంది. గతంలోనే పరిచయమున్న వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు.
కాగా, కనికా కపూర్‌కు ఇది రెండో వివాహం. గతంలో ఎన్నారై రాజ్ చండోక్‌ను 1999లో పెళ్లి చేసుకున్న ఆమె.. 2012లో విడాకులు తీసుకుంది. మొదటి వివాహం ద్వారా ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెండోసారి వైవాహిక బంధం ముగియడం తనకు బాధ కలిగిస్తోందని కనికా వెల్లడించింది. ఈ క్లిష్ట సమయంలో తన వ్యక్తిగత జీవితంపై అభిమానులు సానుభూతితో స్పందించాలని, తమ గోప్యతను గౌరవించాలని కోరింది. అయితే, భర్తతో విడిపోవడానికి గల కారణాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. 48 ఏళ్ల వయసులో మరోసారి విడాకుల నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!